Breaking News

ముఖ్యమంత్రిగా అవకాశం.. వద్దనుకున్న సోనూసూద్‌.. ఎందుకంటే?

Published on Thu, 12/26/2024 - 15:11

ఢిల్లీ : కరోనా (covid-19) సమయంలో ఎంతో మందికి ఆపన్నహస్తం అందించిన రియల్‌ హీరో సోనూసూద్ (Sonu Sood) రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సోనూసూద్‌ ఓ జాతీయ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తులు ‘నాకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారు. నేను తిరస్కరించా. అప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామన్నారు. అదీ వద్దన్నా. రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చింది. వాటిని వద్దనుకున్నాను. రాజకీయాల్లో (politics) ఉండి దేని కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉండదన్నారు.  

స్వేచ్ఛను కోల్పోవడం ఇష్టం లేనందునే రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించినట్లు చెప్పారు. రెండు కారణాలతో రాజకీయం చేస్తారు. ఒకటి డబ్బు కోసం, అధికారం కోసం. వాటిల్లో దేనిపైనా నాకు ఆసక్తిలేదు. ప్రజాసేవ చేస్తున్నాను. ఇందుకోసం ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. నేను ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే చేస్తాను. అదే రాజకీయం చేస్తే జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. స్వేచ్ఛను కోల్పోతామని భయం కూడా ఉంది.  

ఎవరైనా ప్రజాదరణ పొందుతున్నప్పుడు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటారు. కానీ మనం ఎంత ఎంతుకు ఎదిగితే అక్కడ ఆక్సిజన్‌ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే మీరు అక్కడ ఎంతకాలం నిలదొక్కుకోగలరన్నది ముఖ్యం.

రాజకీయాల్లోకి వస్తే ఢిల్లీలో ఇల్లు, ఉన్నత పదవి, భద్రత, విశిష్ట అధికారాలు ఉంటాయని నాకు చాలా మంది చెప్పారు. అవన్నీ బాగున్నాయి. నేను వాటిని వినడానికి ఇష్టపడుతున్నాను. అంతే తప్పా ఇంకా దేని గురించి ఆలోచించడం లేదు. నటుడిగా కొనసాగుతా. నాలో ఒక నటుడు,దర్శకుడు మిగిలి ఉన్నారు, నేను రాజకీయాలకు వ్యతిరేకం కాదు, గొప్ప పని చేసే రాజకీయ నాయకులను నేను గౌరవిస్తాను’ రాజకీయాలపై సోనూసూద్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)