Breaking News

జేఎంఎంకు సీతా సోరెన్‌ రాజీనామా!

Published on Tue, 03/19/2024 - 13:04

జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్‌ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు.
 
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్,  జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్  తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్‌మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. 

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)