నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
సింగయ్య మరణంపై కుట్రలు.. ఎల్లో మీడియాకు బిగ్ షాక్
Published on Sun, 06/22/2025 - 19:29
సాక్షి,గుంటూరు: సింగయ్య మరణంపై పుంకాలు పుంకాలుగా ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియా అండ్ గ్యాంగ్కు బిగ్ షాక్ తగిలింది. సింగయ్య ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలిపేలా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా చేస్తున్న కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయి.
వైఎస్ జగన్పై కొనసాగుతున్న ప్రజల ఆదరాభిమానాలను చూసి కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. అందుకే వైఎస్ జగన్ను ప్రజల్లో తిరిగే అవకాశం లేకుండా, ఆటంకాలు సృష్టించేందుకు తన ఎల్లో మీడియాతో కలిసి కుట్రకు తెరతీసింది. అందుకు రెంటపాళ్ల వైఎస్ జగన్ పర్యటనను వినియోగించుకుంది
కూటమి ప్రభుత్వంలో నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక పల్నాడు జిల్లా, సత్తెన పల్లి నియోజకవర్గం రెంటపాళ్ల ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యుల్ని పరామర్శించేందుకు జూన్ 18న వైఎస్ జగన్ రెంటపాళ్ల వెళ్లారు. వెళ్లే సమయంలో వైఎస్ జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేసింది. కానీ కొద్ది సేపటికే ఎల్లో మీడియా కుట్రలు బయటపడ్డాయి.
వైఎస్ జగన్ కాన్వాయ్కి కంటే ముందు వెళ్లిన వాహనం ఢీకొట్టిన తర్వాత సింగయ్య రోడ్డు పక్కన గాయాల పాలవ్వగా.. అప్రమత్తమైన స్థానికులు 108 ఫోన్ చేశారు. 108 వాహనం రావడం, అందులో సింగయ్యను తరలించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం ఢీకొట్టడంతో సింగయ్య మరణించారంటూ పచ్చ మీడియా విష ప్రచారం చేసిన కొద్ది సేపటికే ఒరిజినల్ వీడియో రావడంతో ఎల్లో గ్యాంగ్ అడ్డంగా దొరికింది.
Tags : 1