Breaking News

వక్ఫ్‌ భూముల వివాదం.. రైతులకు జారీ చేసిన నోటీసులు వెనక్కి: సీఎం ఆదేశం

Published on Sat, 11/02/2024 - 17:15

బెంగళూరు: వక్ఫ్‌ భూముల వివాదంలో రైతులకు జారీ చేసిన అన్ని నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కర్ణాటక మఖ్యమత్రి సిద్దరామయ్య శనివారం అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, కర్నాటక వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

‘వక్ఫ్ ఆస్తులతో ముడిపడిన భూ రికార్డులకు సంబంధించి ​​రైతులకు అందించిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్ని డిప్యూటీ కమిషనర్‌లకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆయన పేర్కొన్నారు’ అని సీఎంఓ కార్యాలయం తెలిపింది.

కాగా విజయపుర జిల్లాకు చెందిన పలువురు రైతులకు తమ భూములు వక్ఫ్ ఆధీనంలోకి వస్తాయని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు తీవ్ర నిరసనలు తెలిపారు. అయితే బీజేపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2022 మధ్య విజయపుర జిల్లాలోని రైతులకు వక్ఫ్ బోర్డు నోటీసులు పంపించిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. దీనిపై ఇటీవల సిద్ధరామయ్య స్పందించి..  రైతులు ఎవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు.

50 ఏళ్ల క్రితమే తమ పేరిట కొన్ని భూములు రిజిస్టర్ అయినట్లు వక్ఫ్ బోర్డు పేర్కొందని, అయితే, ఏదైనా క్లెయిమ్‌లు చెల్లుబాటు కావాలంటే వక్ఫ్, రెవెన్యూ రికార్డులు తప్పనిసరిగా సమలేఖనం చేయాలని ర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు. లేకుంటే రెవెన్యూ రికార్డులకే ప్రాధాన్యం ఉంటుందన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)