సీఎం సిద్దరామయ్య అమాయకుడు: డీకే

Published on Tue, 08/20/2024 - 17:05

బెంగళూరు: మైసూరు నగర అభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్దరామయ్యను టార్గెట్‌ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి పదవి నుంచి సిద్దరామయ్యను దింపడమే లక్ష్యంగా కమలం పార్టీ పని చేస్తుందని మండిపడ్డారు. ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎం సిద్దరామయ్యకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

కాగా ముడా భూముల కేటాయింపులో అవకతవకలపై సీఎం సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్‌ అనుమతిచ్చిన విసయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం పదవికి సిద్దూ రాజీనామా చేయాలని బీజేపీ పట్టుబడుతోంది. 

దీనిపై తాజాగా శివకుమార్‌ మాట్లాడుతూ.. సిద్దరామయ్య అమాయకుడని, ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి బూత్ స్థాయి కార్యకర్త వరకు అంతా సిఎం సిద్దరామయ్య వెంట ఉన్నారన్నారు. ఆయన రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.  

చట్టమే ముఖ్యమంత్రిని కాపాడుతుందని, ముఖ్యమంత్రి తప్పు చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఇది పూర్తిగా బీజేపీ ఆడుతున్న రాజకీయ డ్రామాగా అభివర్ణించారు. మరోవైపు తాను ముఖ్యమంత్రి పదవి కోసం తాపత్రయపడుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అది హైకమాండ్ నిర్ణయమని తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాసినట్లు డీకే వెల్లడించారు.. సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూషన్ చేయాలంటూ గవర్నర్ ఆదేశాలు జారీ చేసిన అంశంలో జోక్యం చేసుకోని, ఆ ఆర్డర్‌ను వెనక్కి తీసుకునేలా గవర్నర్‌తో మాట్లాడాలని రాష్ట్రపతి ముర్మును కోరినట్లు తెలిపారు.

కాగా గవర్నర్ జారీ చేసిన ఆదేశాలు నిలిపివేయాలంటూ.. సీఎం సిద్దరామయ్య సోమవారం కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్ట్ 29వ తేదీ వరకు ఈ కేసులో సీఎం సిద్దరామయ్యను ఎటువంటి ప్రాసిక్యూషన్ చేయవద్దంటూ కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో సిఎం సిద్దరామయ్యకు తాత్కాలిక ఊరట లభించినట్లు అయింది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)