Breaking News

మీ నాన్నను అవమానిస్తున్నారు. సిగ్గుగా లేదా?

Published on Sat, 06/24/2023 - 09:42

ముంబై: బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తన తండ్రిని అవమానించిన వారితో చేతులు కలపడం ఆయనను అవమానించడమేనని అన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.

అధికార బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలిపిన విపక్షాలు బీహార్లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మహారాష్ట్ర మాజీ  ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెహబూబా మఫ్టీ పక్కన కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించిందని, ఒకప్పుడు పీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే మెహబూబా మఫ్టీ విషయమై మమ్మల్ని ఎగతాళి చేసిన మీరు ఆమెతో చేతులు కలపడం హాస్యాస్పదంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్.

వారు "మోదీ హటావో" నినాదంతో కలిసినట్లు చెబుతున్నారు గానీ వాస్తవానికి "పరివార్ బచావో(మమ్మల్ని కాపాడండి)" అనే నినాదంతో వెళ్లి ఉంటే బాగుండేదన్నారు. ఈ విపక్షాల సమావేశం వలన మాకు గానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ కలిగే నష్టమేమీ లేదని ఇదే ప్రయత్నం వీళ్ళు 2019లో కూడా చేశారని,  ప్రజలు వాస్తవాలను గ్రహించి మళ్ళీ మోదీకే పట్టం కడతారని జోస్యం చెప్పారు.

ఇక ఇదే సమావేశంలో లాలూతో కలిసి ఉద్దవ్ థాక్రే చేతులు కలపడమంటే అది తన తండ్రిని అవమానించడమేనని తీవ్రంగా తప్పుబట్టారు బీజేపీ నేత చిత్రా కిషోర్ వాఘ్. గతంలో ఓసారి మీ నాన్నను ఉద్దేశించి లాలూ మాట్లాడుతూ.. థాక్రే మూలాలు బీహార్లోని ఉన్నాయని నోరుపారేసుకున్నారు. ఆరోజు మీ నాన్న ఏమన్నారో చూసి బుద్ధి తెచ్చుకోండని ఒక వీడియోని పోస్ట్ చేశారు. వీడియోలో బాల్  థాక్రే స్వయంగా లాలూ ప్రసాద్ యాదవ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)