Breaking News

‘డీకే.. మరో ఏక్‌నాథ్‌ షిండే’

Published on Fri, 02/28/2025 - 21:34

బెంగళూరు:  కర్ణాటక డిప్యూటీ సీఎం, ​ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్.. శివరాత్రికి కోయంబత్తూరులో సద్గురు(జగ్గీ వాసుదేవ్) ఏర్పాటు చేసిన ఈవెంట్ కు హాజరైన సంగతి తెలిసిందే. ఇది అటు జాతీయ కాంగ్రెస్ కు, ఇటు కర్ణాకట కాంగ్రెస్ లో సైతం హీట్ పుట్టించింది. దీనిపై కాంగ్రెస్ నేతలు కొందరు ఇప్పటికే తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే రాహుల్ గాంధీ అంటే డీకేకు గౌరవం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే డీకే.. బీజేపీలో చేరడానికి సన్నాహాలు ఏమైనా చేస్తున్నారా అనే వాదన కూడా వినిపించింది.  ఆ ఈవెంట్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరు కావడంతో దీనికి మరింత బలపడింది.

అయితే తాజాగా కర్ణాటక బీజేపీ.. డీకే శివకుమార్ మరో మహారాష్ట్ర ఏక్ నాథ్ షిండే కానున్నారంటూ వ్యాఖ్యానించడం కూడా కాంగ్రెస్ లో మరింత అలజడి రేపింది. మహారాష్ట్రలో శివసేన పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఏక్ నాథ్ షిండే సహకరించిన విషయాన్ని  ఆర్ అశోక ప్రస్తావించారు. అదే బాటలో డీకే శివకుమార్ కూడా నడిచి కాంగ్రెస్ ను చీల్చుతారని ఆయన ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్ బలమైన నేతగా ఉన్న డీకే.. ఆ పార్టీని కూల్చడం  జరుగుతుందంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై  డీకే శివకుమార్ స్పందించారు..  ఇది బీజేపీ గేమ్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. తాను కాంగ్రెస్ వాదినని, ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను వీడనని స్పష్టం చేశారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ గెలుపునకు కృషి చేస్తానని డీకే పేర్కొన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)