సద్గురు ఈవెంట్‌కు డీకే.. ఉలిక్కిపడ్డ కాంగ్రెస్‌

Published on Thu, 02/27/2025 - 16:55

బెంగళూరు: మహా శివరాత్రి సందర్బంగా నిన్న(బుధవారం) కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్(సద్గురు) నిర్వహించిన ఈవెంట్ కు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ కీలక నేత డీకే శివ కుమార్ హాజరుకావడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తించింది.   ఆ ఈవెంట్ కు సద్గురుతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డీకే శివకుమార్ స్టేజ్ షేర్ చేసుకున్నారు. దీనికి కర్ణాటక కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావాజాలాలతో ఏర్పాటు చేసిన సద్గురు ఈవెంట్ కు డీకే శివ కుమార్  వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందనేది కాంగ్రెస్ ప్రశ్నగా ఉంది.

దీనిపై ఏఐసీసీ సెక్రటరీ పీవీ మోహన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.  శివ కుమార్ ట్యాగ్ చేసి మరీ పీవీ మోహన్ వివరణ అడిగారు. కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీని పదే పదే విమర్శించే వారి ఈవెంట్ వెళ్లడమే కాకుండా,  అందుకు థాంక్యూ చెప్పడాన్ని ఇక్కడ పీకే మోహన్ ప్రశ్నించారు.

రాహుల్ చెప్పేది అదే.. అలా ఉంటే పార్టీని వదిలేయండని..

శివ కుమార్ టార్గెట్ చేస్తూ చేసిన పోస్ట్ పై పీకే మోహన్ వివరణ ఇచ్చారు. ‘ నేను ఇక్కడ  ఎవర్నీ విమర్శించడం లేదు.  శివ కుమార్ భావజాలంపై నా అభిప్రాయం ఏమిటో నేను చెప్పాను. జగ్గీవాసుదేవ్ భావజాలం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల  భావజాలమే. దీనికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. మాది సెక్యులర్ పార్టీ. మా నాయకుడు రాహుల్ గాంధీ పదే పదే చెప్పేది కూడా అదే.  ఎవరైనా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉంటే పార్టీని వదిలేయొచ్చని చెబుతూనే ఉన్నారు. అదే నేను నా పోస్ట్ ద్వారా తెలియజేశాను’ అని పీకే మోహన్ పేర్కొన్నారు. 

 

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)