Breaking News

నేను రాహుల్ అభిమానిని..కాంగ్రెస్‌ ర్యాలీలో కన్నడ సూపర్‌ స్టార్

Published on Tue, 05/02/2023 - 16:31

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 8 రోజులే ఉండటంతో ప్రచారం ఊపందుకుంది.  ఈ క్రమంలోనే కాంగ్రెస్ శివమొగ్గలో భారీ ర్యాలీ నిర్వహించింది. అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరైన ఆ బహిరంగ సభలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్ సందడి చేశారు. తాను రాహుల్ గాంధీకి పెద్ద అభిమానినని, ఆయనతో పాటు ర్యాలీకి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు.

'నేను ఇక్కడికి రాహుల్ గాంధీ అభిమానిగా వచ్చా. ఆయన ఇటీవలే భారత్ జోడో యాత్రలో దేశమంతా పాదయాత్ర చేశారు. ఆ యాత్ర నుంచి చాలా స్ఫూర్తి పొందా.' అని శివరాజ్ కుమార్ తెలిపారు.  ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు కేరింతలు, చప్పట్లతో సభను మారుమోగించాయి.

కాగా.. శివరాజ్ కుమార్ సతీమణి గీత శివ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ ప్రచారంలో  పాల్గొనడం కాంగ్రెస్‌కు కచ్చితంగా ప్రయోజనం చేకూర్చే విషయమే అని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.
మరోవైపు బీజేపీ తరఫున కన్నడ సీనియర్ హీరోలు కిచ్చ సుదీప్, దర్శన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. సీఎం బొమ్మైతో కలిసి వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే వీరు కమలం పార్టీలో అధికారికంగా చేరలేదని, వారి వల్ల తమకు ఎలాంటి నష్టం ఉండదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి..

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)