Breaking News

మహిళా జర్నలిస్ట్‌పై అసభ్య వ్యాఖ్యలు.. చిక్కుల్లో శివసేన షిండే వర్గం నేత

Published on Thu, 08/22/2024 - 08:38

ముంబై: బద్లాపూర్‌లో చిన్నారులపై జరిగిన హత్యాచారాన్ని కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్‌పై శివసేన (షిండే) వర్గం నేత చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. హత్యాచార ఘటనను  కవర్‌ చేస్తున్న తనపై శివసేన (షిండే) వర్గం నేత  వామన్‌ మాత్రే.. అసభ్య వ్యాఖ్యలు చేశారని స్థానిక టీవీలో పనిచేసే మహిళా జర్నలిస్టు తెలిపారు. 

‘‘బాద్లాపూర్‌ మాజీ మేయర్ అయిన వామన్‌ మాత్రే నాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు.  ఆయన వ్యాఖ్యలు నాకు చాలా ఆగ్రహం కలిగించాయి. నేను నిజాల ఆధారంగానే హత్యాచార ఘటనను కవర్ చేశాను’’ అని మహిళా జర్నలిస్ట్ అన్నారు. అనంతరం వామన్‌ మాత్రే స్పందిసూ​.. జర్నలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా జర్నలిస్ట్‌ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో కుమ్మక్కు  అయ్యారని  అన్నారు. ‘‘ఇది ఆ మహిళా జర్నలిస్ట్ చేస్తున్న ఒక స్టంట్‌.  ఆమె నాకు చాలా రోజుల  నుంచి తెలుసు. ఆమె శివసేన(యూబీటీ)కి అనుకూలంగా పనిచేస్తారు. మీరు ఈ సంఘటనను రెండుమూడు రోజులుగా కవర్ చేస్తున్నారు. బాలికలపై దాడి జరిగిందా? లేదా? అనే దాని గురించి సరైన సమాచారాన్ని నివేదించాలని అడిగాను. అంతేకాని, నేను ఆమెతో అసభ్యంగా మాట్లాడలేదు’’ అని అన్నారు.

మరోవైపు.. వామన్‌ మాత్రే  చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిచాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. మాత్రే వ్యాఖ్యలను ముంబై ప్రెస్ క్లబ్ ఖండించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేను కోరింది. ప్రజల సెంటిమెంట్‌ను, పత్రికా గౌరవాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)