Breaking News

మారని శశిథరూర్‌ తీరు..!

Published on Fri, 01/23/2026 - 11:11

తిరువనంతపురం:  కాంగ్రెస్‌ సీనియర్‌ ఎంపీ శశిథరూర్‌ మరోసారి పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయనున్నారా?, కాంగ్రెస్‌తో అంటీ ముట్టనట్లు, బీజేపీతో అత్యంత దగ్గరగా ఉండే శశిథరూర్‌.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏదొక వంకతో కాంగ్రెస్‌ను దూరం పెడుతూనే ఉన్నారు. తాజాగా కేరళ కాంగ్రెస్‌ నేతలతో  ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీలు సమావేశం కావడానికి సమయం ఫిక్స్‌ చేశారు. ఈరోజు(శుక్రవారం, జనవరి 23వ తేదీ) మధ్యాహ్నం గం. 2.30 ని.లకు సమావేశం కానున్నారు. అయితే దీనికి కేరళ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, నాలుగు సార్లు ఎంపీగా గెలిచిన శశిథరూర్‌ దూరంగా ఉండనున్నారట.

తనను ఒకానొక సందర్భంలో రాహుల్‌ గాంధీ నుంచి అవమానం ఎదురైందనే భావనలో ఉన్నారు శశిథరూర్‌. ఇటీవల కేరళ పర్యటనకు వచ్చిన రాహుల్‌ గాంధీ.. తనకు తగినంత గౌరవం ఇవ్వలేదని శశిథరూర్‌ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అందుచేతనే ఆయన.. కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలతో ఏఐసీసీ నేతల సమావేశానికి హాజరు కావడం లేదని సదరు వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ కారణంగా శశిథరూర్‌.. కాంగ్రెస్‌ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.  కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందే జరిగే ఈ సమావేశానికి శశిథరూర్‌ దూరంగా ఉండటం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సీడబ్యూసీ సమావేశానికి వెళ్లిన శశిథరూర్‌.. రాహుల్‌ గాంధీ సమావేశాలకు మాత్రం  డుమ్మా కొడుతున్నారు. ఇదే  ఇప్పుడు కేరళ కాంగ్రెస్‌లో అలజడికి కారణమైంది.   ఎన్నికలు వచ్చిపడుతున్న వేళ.. శశిథరూర్‌ తీరు కాంగ్రెస్‌ నేతలకు అంతు చిక్కడం లేదు. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి