Breaking News

‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’

Published on Tue, 10/29/2024 - 18:55

ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్‌ శరద్ పవార్‌.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్‌ను అనుకరించారు. 

శరద్ పవార్ ప్రసంగిస్తూ..  ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు  కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు.

...నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్‌ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్‌కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.

అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్‌ పవార్‌కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్‌ పవార్‌ పైవ్యాఖ్యలతో కౌంటర్‌ ఇవ్వటం గమనార్హం.

చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్‌ తరలించారు: శరద్‌ పవార్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)