Breaking News

వారంతా అవినీతిపరులే.. కేసులు నుండి తప్పించుకోడానికే.. 

Published on Mon, 07/03/2023 - 13:37

ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు.  

అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు. 

మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు. 

ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది.  

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు.    

ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్     

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)