Breaking News

అజిత్‌ పవార్‌, బీజేపీ నేతలపై.. ఎన్నికల సంఘానికి శరద్‌ పవార్‌ ఫిర్యాదు

Published on Fri, 04/19/2024 - 21:06

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ అజిత్ పవార్, ఇద్దరు బీజేపీ నాయకులపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌ పవార్-ఎన్సీపీ వర్గం) ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాము అధికారంలోకి వస్తే నిధుల్ని విడుదల చేస్తామంటూ ఓటర్లకు హామీ ఇవ్వడం ద్వారా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపించింది.  

అజిత్ పవార్, మంగేష్ చవాన్, చంద్రకాంత్ పాటిల్‌లు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 పదేపదే ఉల్లంఘించినందుకు భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాము అని ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం పేర్కొంది.
 
తమ అభ్యర్థిని ఎన్నుకుంటేనే తమ అధికారిక పదవులను ఉపయోగించుకుని రాష్ట్ర ఆర్థిక నిధులను పంపిణీ చేస్తామని నేతలు పదేపదే వాగ్దానం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. మహరాష్ట్ర అధికార పార్టీ ప్రాథమికంగా లంచం,అవినీతి పద్ధతుల్ని అవలంభిస్తోందని ఆరోపిస్తోంది.  

సదరు నేతలపై తక్షణమే చర్యలు తీసుకునేలా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక కలెక్టర్, డిప్యూటీ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది.  మన ప్రజాస్వామ్య దేశంలో న్యాయబద్ధత, న్యాయం, చట్టబద్ధమైన పాలనను అందించేలా తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు ఎన్సీపీ శరద్‌ పవార్‌ వర్గం తెలిపింది.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)