Breaking News

ఓటుకు నోటు..అజిత్‌ పవార్‌ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ ​కేసు నమోదు

Published on Tue, 05/07/2024 - 17:53

లోక్‌సభ ఎన్నికల తరుణంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేలా నగదు పంపిణీ చేశారంటూ మహరాష్ట్ర అజిత్‌ పవార్‌ (ఎన్‌సీపీ) వర్గంలోని ఐదుగురి మద్దతు దారులపై పోలీసులు నాన్ కాగ్నిసబుల్ ​కేసు నమోదు చేశారు.

మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల పోరులో వదిన-మరదళ్ల సమరం ఆసక్తిని రేపుతోంది. అజిత్ పవార్ తిరుగుబాటుతో రెండు ముక్కలైన ఎన్‌సీపీకి కంచుకోటగా ఉన్న బారామతి లోక్‌సభ స్థానం నుంచి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్) వర్గం నేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్, మరోవైపు శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే ఎన్సీపీ( ఎస్పీ) గ్రూపు నుంచి పోటీ చేస్తున్నారు.  

మంగళవారం మహరాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో మూడవ దశలో 11 స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్‌కు ముందు రోజు అంటే సోమవారం అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొందరు వ్యక్తులు బారామతి లోక్‌సభ పోలింగ్‌కు ముందు జిల్లాలోని భోర్ పట్టణంలోని ఓటర్లకు నగదు పంపిణీ చేశారని ఎన్‌న్సీపీ (శరద్‌ పవార్)  ఆరోపించింది. దీంతో పూణే పోలీసులు నిందితులపై నాన్ కాగ్నిసబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.  

శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తన పార్టీపై, పార్టీ మద్దతుదారులపై వస్తున్న ఆరోణల్ని కొట్టిపారేశారు.
 

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)