Breaking News

AP: అంతా ప్రీ ప్లాన్డ్‌గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!

Published on Tue, 05/21/2024 - 08:30

సాక్షి, విజయవాడ: ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 150 పేజీల ప్రాథమిక నివేదికను సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందజేశారు. సిట్ ప్రాథమిక నివేదికలో  పోలీసుల వైఫల్యాలు బయటపడ్డాయి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. నాలుగు బృందాలుగా మూడు జిల్లాల్లో పర్యటించిన సిట్.. 33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలను పరిశీలించింది.

ఈ అల్లర్లలో 1370 మంది నిందితులకు 124 మందినే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 639 మంది నిందితులను ఇంకా గుర్తించాల్సి ఉందని సిట్ పేర్కొంది. 1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన‌ సిట్‌.. దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించింది.

రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్.. రెండు గ్రూపుల‌ మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొంది. ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తించింది. దాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదిక పేర్కొంది.

ఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకు కారణంగా సిట్ నివేదికలో వెల్లడించింది. పరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సూచించిన సిట్.. కోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్ష‌న్లు జోడించాలని పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను డీజీపీ ఆదేశించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)