Breaking News

టీడీపీకి భారీ షాక్.. జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి ఎస్‌.బాల సుబ్రమణ్యం

Published on Wed, 06/25/2025 - 16:11

 

సాక్షి, తాడేపల్లి: అన్నమయ్య జిల్లా రాజంపేటలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం.. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగిన సుగవాసి కుటుంబం టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్‌ జగన్‌ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.

సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా పని చేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి ఉప ఎన్నికలో టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఆయన ఓడిపోయారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, మాజీ మంత్రి ఎస్‌.బి.అంజాద్‌ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వి.సతీష్‌కుమార్‌ రెడ్డి, కడప మేయర్‌ సురేష్‌ బాబు, రమేష్‌ కుమార్‌ రెడ్డి, ఎన్‌.శ్రీనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

 

YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)