Breaking News

బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. గులాబీ పార్టీకి కేసీఆర్‌ సన్నిహితుడు గుడ్‌బై

Published on Mon, 06/12/2023 - 19:16

సాక్షి, నిర్మల్‌: బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, సీఎం కేసీఆర్‌కు సన్నిహితుడైన కూచాడి శ్రీహరిరావు పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలో త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. దీంతో, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌ తగలింది. 

వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినప్పటికీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తమకు గుర్తింపు లేకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీహరిరావు అన్నారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా కేంద్రంలో తన‌‌  అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వచించారు. ఈ సందర్భంగా  రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ తెలంగాణలో రెండోసార్లు అధికారంలోకి వచ్చి  ప్రజలను వంచించిందన్నారు. అలాంటి  మోసాలను చేయడం   ఇష్టం లేక  పార్టీకి రాజీనామా  చేస్తున్నట్లు   తెలిపారు.‌ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి ప్రజలు మద్దతు పలుకుతున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి  రావాలని  కోరుకుంటున్నట్టు కామెంట్స్‌ చేశారు. ఇక, ఈనెల 17లోగా శ్రీహరి రావు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఇక, శ్రీహరిరావు.. 2007లో టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా శ్రీహరిరావు ఉన్నారు. అంతకుముందు, బహిరంగ సభల్లో ప్రతిసారి శ్రీహరిరావుతో ఉన్న తన అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. శ్రీహరిరావుతో గతంలో బీజేపీ నేతలు సైతం చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. 

ఇది కూడా చదవండి: ధరణి పోర్టల్‌పై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)