Breaking News

సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్‌

Published on Tue, 03/26/2024 - 08:06

సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. అటు బీజేపీకి ఇచ్చినా లేక టీడీపీ వద్దే ఉంచుకున్నా తానే బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోను గుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు.

మరోవైపు కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలిచానని, తనకే టికెట్‌ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్‌ డిమాండ్‌ చేస్తున్నారు. పైగా శ్రీరామ్, సూరి మధ్య ముందు నుంచీ సఖ్యత లేదు. టికెట్‌ విషయంలో పంతం నెగ్గించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. బల ప్రదర్శనకు కూడా సిద్ధ మయ్యారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గీ యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా.. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా బరి లో ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో కూ టమి భిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. 

యువగళంతో శ్రీరాంలో ఆశ 
2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరదాపురం సూరి తన కాంట్రాక్టుల కారణంగా బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ తరఫున ధర్మవరం ఇన్‌చార్జ్‌గా పరిటాల శ్రీరామ్‌ వచ్చారు. తొలి మూడేళ్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ  కనీసం ఖాతా కూడా తెరవలేదు. కేడర్‌ను బలోపేతం చేయడంలోనూ పరిటాల శ్రీరామ్‌ పూర్తిగా విఫలమైనట్లు చెబుతున్నారు. అయితే యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్‌ బత్తలపల్లిలో శ్రీరామ్‌ చేయి పైకెత్తి గెలిపించాలని కోరడంతో ఆయనలో టికెట్‌ ఆశ మొదలైంది. అంతేకాకుండా రాప్తాడులో ఓడిపోయిన బాధతో ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావించారు. మరోవైపు వరదాపురం సూరి చంద్ర బాబుతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

రేసులోకి సత్యకుమార్‌! 
ధర్మవరం టికెట్‌ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు వదలకపోవడంతో ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్‌ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్‌ నిరాకరిస్తున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: జనసేన నేతలకు పవన్‌ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)