Breaking News

Shiv Sena (UBT): ‘సీట్ల పంపిణీ చర్చలు మళ్లీ మొదటికి’

Published on Fri, 12/29/2023 - 17:25

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో సీట్ల పంపణీ విషయంపై శివసేన(ఉద్దవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే) పార్టీ సంప్రదింపులు ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి సీట్ల పంపిణీ చర్చలు జరగనున్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ తెలిపారు. శివసేన గెలిచిన సీట్లపై కాకుండా మిగతా సీట్లపై  చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని తెలిపారు. ఇదే విషయాన్ని తాము కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలకు తెలియజేశామన్నారు.

2019లో బీజేపీ  కూటమి ద్వారా  ఎన్నికల బరిలోకి దిగి 23 స్థానాల్లో పోటీ చేయగా 18 సీట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది శివసేనలో ఏక్‌నాథ్‌ షిండే ఆధ్వర్యంలో చీలికలు వచ్చాయి. మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్రకు సీఎం అయ్యారు. అయితే ఇప్పటికీ  శివసేన(ఉద్దవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రే).. కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమిలో కొనసాగుతోంది. 

మొదటి నుంచి శివసేన(యూబీటీ)  తాము 23 స్థానాల్లో పోటీ చేస్తామంటూ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్‌ పార్టీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో​ శివసేన(యూబీటీ) తాము 2019లో గెలిచిన సీట్లు తప్ప మిగతా వాటిపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని కాంగ్రెస్‌ నేతలకు వెల్లడించింది.

చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)