Breaking News

‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’

Published on Thu, 09/07/2023 - 15:59

చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యధికులు స్టాలిన్ మాటలను వ్యతిరేకిస్తుంటే కొందరు మాత్రమే సమర్థిస్తున్నారు. తాజాగా డీఎంకే మరో మంత్రి ఏ రాజా.. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వెనకేసుకొచ్చారు. 

గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ సున్నిత మనస్కులు కాబట్టి సున్నితంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులతో పోల్చారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులకు సమాజంలో ఎలాంటి బెరుకు ఉండదని సనాతన ధర్మాన్ని సమాజాన్ని భయపెట్టే హెచ్ఐవి, కుష్టు వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు. సనాతన ధర్మం, విశ్వకర్మ యోజన రెండు వేర్వేరు కాదని రెండూ ఒక్కటేనని అన్నారు. 

ఈ అంశంపై డిబేట్ పెడితే చర్చలకు పెరియార్, అంబేద్కర్ పుస్తకాలను వెంటబెట్టుకుని ఢిల్లీ వస్తానని అన్నారు. నాపై రివార్డులు కూడా ప్రకటించనీ నేనైతే భయపడేది లేదని అన్నారు. ఒకవేళ ప్రధాన మంత్రి చర్చలకు రమ్మన్నా వెళతాను.. అనుమతిస్తే కేంద్ర కేబినెట్ మంత్రులతో కూడా దీనిపై చర్చకు సిద్ధమని సనాతన ధర్మం అంటే ఏమిటో చెబుతానని అన్నారు. 

ఇది కూడా చదవండి: ‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)