Breaking News

తండ్రి ఒక పార్టీ.. కొడుకు మరో పార్టీ.. కలిసే ‍ప్రచారం?

Published on Tue, 04/02/2024 - 07:03

దేశంలో లోక్‌సభ ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. అదే సమయంలో రాజకీయ పార్టీలతో ముడిపడిన కుటుంబాలు ఆసక్తికర పోరుకు ఆజ్యం పోస్తున్నాయి. యూపీలోని అలహాబాద్‌లో ఇలాంటి ఉదంతం చర్చల్లోకి వచ్చింది. 

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నేత, యూపీ మాజీ క్యాబినెట్ మంత్రి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అతని తండ్రి కున్వర్ రేవతి రమణ్ సింగ్ సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత.  అలహాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఉజ్వల్ రమణ్ సింగ్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

అయితే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు నేతలు వేర్వేరు పార్టీల్లో  ఉండటం ఆసక్తికరంగా మారింది. కాగా సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమి కింద లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయి. దీనిలో భాగంగా యూపీలోని అలహాబాద్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఈ టిక్కెట్‌ను ఉజ్వల్ రమణ్ సింగ్‌కు కేటాయించాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వాలని  ఆ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఇండియా కూటమి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు