Breaking News

చంద్రబాబు అహంకారి.. 2019 కంటే TDPకి ఘోరమైన ఓటమి: సజ్జల

Published on Sat, 04/06/2024 - 13:59

గుంటూరు, సాక్షి: చంద్రబాబు తన కూటమిలోని వాళ్లనే చిన్న చూపు చూస్తున్నారని.. ఆయన వల్లే బీజేపీ, జనసేనకు అసలు ఉనికే లేకుండా పోయిందని వైస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమిని గ్రహించే చంద్రబాబు పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్నారని, ప్రజలకు సంక్షేమం అందకుండా కుట్రలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

జనసేన, బీజేపీలో ఉన్నవాళ్లకు నిరాశే.  కూటమిలో ఉన్నా చంద్రబాబు ఎవరికి అనుకుంటే వాళ్లకు సీట్లు ఇచ్చేలా చేశారు. తన మనుషులకే టికెట్లు ఇప్పించుకున్నారు. బీజేపీలో కూడా బాబు చెప్పినట్లే సీట్లు ఖరారు అయ్యాయి. కానీ, 2019 ఎన్నికలంటే టీడీపీ ఘోరంగా ఓడిపోబోతోంది. అందుకే ఓటమిని గ్రహించి చంద్రబాబు ఎగిరెగిరి పడుతున్నారు. పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు అవుతుంది.

2019లో అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసు. ఆయన పాలనను ప్రజలు మరిచిపోలేదు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఈవో మీదకు దూకుడుగా వెళ్లారు. దబాయించి మాట్లాడారు.. (అందుకు సంబంధించిన వీడియోను సజ్జల ప్రదర్శించారు). వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు.  ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ.. వాటిపై దాడి చేస్తూ వస్తున్నారు.

చంద్రబాబు అండ్‌ కో కక్షతో వలంటీర్‌ వ్యవస్థపై విష ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల ముందర ఆ వ్యవస్థను దూరం చేసింది. తన ఏజెంట్‌ నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. వృద్ధులకు, దివ్యాంగులకు ఫించన్లు, పథకాలు అందకుండా కుట్ర చేస్తోంది. వలంటీర్‌ వ్యవస్థ వల్ల రెండ్రోజుల్లో ఫించన్ల పంపిణీ పూర్తయ్యేది. కానీ, ఇప్పుడది ఆలస్యం అయ్యింది. దీంతో పెన్షనర్షలోనూ ఆందోళన వ్యక్తం అయ్యింది. దురదృష్టవశాత్తూ.. ఎండలకు తాళలేక కొందరు చనిపోయారు. అధికారులపైనా చంద్రబాబు అండ్‌ కో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు రాక్షస మనస్తతత్వం ఏ నాయకుడిలో కనిపించలేదు.

చంద్రబాబును శాశ్వతంగా సీఎంను చేసేదాకా రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రుడికి మనసు శాంతించదేమోనని సజ్జల అన్నారు. చంద్రబాబు వదిన పురందేశ్వరి జాతీయ పార్టీలో ఉన్నా.. ఎజెండా మాత్రం చంద్రబాబు కోసం పని చేయడమే. అహంకారంతో ఈ మధ్య ఆమె అధికారులపైనే ఫిర్యాదు చేశారు. చంద్రబాబే సీఎం అనుకుని ఆమె లేఖ రాశారా?. ఈసీ తాను చెప్పినట్లు వింటుందని లేఖ రాశారా? తెలియదు. తన మరిదిని సీఎం చేయాలన్నదే ఆమె తాపత్రయంగా కనిపిస్తోంది.

చంద్రబాబు చేష్టలతో ఏపీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. 2014-19 పాలన ఎక్కడ పునరావృతం అవుతుందో అని ఆలోచన చేశారు. రావణుడిలా చంద్రబాబు మారు వేషంలో ఓటర్ల దగ్గరకు వస్తున్నారు. బాబు సాధువు రూపంలో వచ్చి నమ్మించే యత్నం చేశారు. ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతీ వ్యవస్థ పారదర్శకంగా పని చేస్తోంది. కోవిడ్‌ సమయంలోనూ సీఎం జగన్‌ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారు. సచివాలయ ఉద్యోగులు లక్షా పాతిక వేల మంది ఉన్నారని చంద్రబాబే స్వయంగా ఒప్పుకున్నారు.

షర్మిల ఇవ్వాల్సిన సంజాయిషీలు చాలా ఉన్నాయి. తెలంగాణ నుంచి హఠాత్తుగా ఎందుకు మాయం అయ్యారు?. ఇక్కడి(ఏపీ) కాంగ్రెస్‌ బాధ్యతలు ఎవరిచ్చారు? ఎందుకు షర్మిల తీసుకున్నారు?.. కాంగ్రెస్‌తో కొట్లాడుతానని.. ఇప్పుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు. వివేకా హత్య కేసు గురించి నాలుగేళ్లుగా మాట్లాడని ఆమె.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు. ఇదంతా.. మరో నెలలో ప్రజా కోర్టులో అది తేలుతుంది అని సజ్జల అన్నారు. 

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు