Breaking News

‘చంద్రబాబు సర్కార్‌కు గుణపాఠం చెబుదాం’

Published on Sun, 11/09/2025 - 16:30

సాక్షి,తాడేపల్లి: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో 12న జరిగే ర్యాలీలను సూపర్‌ సక్సెస్‌ చేద్దాం. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం. ప్రజా స్పందనను బలంగా వినిపిద్దాం’అంటూ పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.  

వైఎస్సార్‌సీపీ సీఈసీ, ఎస్‌ఈసీ సభ్యులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్స్‌, మండల పార్టీ అధ్యక్షులు, జెడ్పీ ఛైర్మన్‌లు, వైస్‌ ఛైర్మన్‌లు, జెడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ ఛైర్‌పర్సన్‌లు, వైస్‌ ఛైర్‌పర్సన్‌లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..  మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 12న ర్యాలీలు జరుగనున్నాయి, కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది.

 మనం తీసుకుంటున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12న జరిగే ర్యాలీలు ఉండాలి. వైద్యవ్యవస్ధను జగన్‌ ప్రజలకు చక్కటి గొడుగులా తయారుచేస్తే చంద్రబాబు దానిని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది. కలిసి వచ్చే పార్టీలందరినీ కలుపుకుపోదాం. కులసంఘాలు, స్వఛ్చంద సంస్ధలు, ట్రేడ్‌ యూనియన్లు ఇలా అందరినీ కలుపుకుందాం. అప్పుడే సూపర్‌ సక్సెస్‌ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తిచేయాలి. ఏ మాత్రం ఏమరుపాటు వద్దు, అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్‌గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్ షిప్‌ తీసుకుని లీడర్లుగా నిరూపించుకునే అవకాశం ఇది.  

స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరంతా సిద్దంగా ఉండాలి, దీనిపై కూడా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. క్షేత్రస్ధాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఈ కమిటీలన్నీ పూర్తయితే దాదాపు 13 లక్షల మంది సైన్యం సిద్దమవుతుంది. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేపన్‌ చేయాలి. పరిశీలకుల సహాకారం తీసుకుని పక్కాగా చేయండి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్‌ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్భందీగా చేయాలి, డేటా అంతా కూడా డిజిటలైజ్‌ చేయాలి.  

ప్రతి ఇంట్లో మన పార్టీ ఉంటుంది, నిత్యం ప్రజా సమస్యలపై మనం చేస్తున్న పోరాటాలకు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. ప్రజల్లో మన పార్టీకి ఉన్న ఇమేజ్ బాగా పెరుగుతుంది. దీనిని ఇంకా మరింతగా పెంచుకుందాం. కూటమి ప్రభుత్వ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం’అని సూచించారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణాష్టమి సందడి.. సినీ ప్రముఖుల పిల్లలు ఇలా (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)