‘ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి’

Published on Fri, 07/31/2026 - 19:21

తాడేపల్లి :ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో-ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇందుకోసం సోషల్‌ మీడియాను గ్రామస్థాయి నుంచి విస్తృతంగా వాడుకోవాలన్నారు. ఈరోజు(శుక్రవారం, జూలై 31వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్‌ మీడియా విభాగం సమావేశం నిర్వహించారు సజ్జల. దీనికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ, నగర అధ్యక్షులు హాజరయ్యారు.

దీనిలోభాగంగా సజ్జల మాట్లాడుతూ.. ‘ అసభ్య పదజాలం, మార్ఫింగ్‌ కంటెంట్‌కు తావివ్వకూడదు. ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను ఆధారాలతో తిప్పికొట్టండి. గ్రామస్థాయి నుంచి సోషల్‌ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అక్రమ కేసులు, వేధింపులన్నీ ‘డిజిటల్‌ డైరీ’ లో నమోదు చేయాలి. ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. వివరణలు ఇచ్చే పరిస్థితి నుంచి అటాకింగ్‌ మోడ్‌లోకి రావాలి. సోషల్‌ మీడియా కార్యకర్తలు ఒక వన్‌ మ్యాన్‌ ఆర్మీలా పని చేయాలి. 

పదునైన కంటెంట్‌తో నిజాన్ని పదిమందికి చేరవేయాలి. ప్రజల గొంతుకగా, క్రమశిక్షణతో కూడిన బాధ్యతాయుతమైన డిజిటల్‌ ప్రతినిధులుగా పని చేయాలి. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా, సిద్ధాంతాలను, లైన్‌ ఆఫ్‌ థింకింగ్‌ను వదులుకోకుండా నిలబడాలి. వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా విభాగాన్ని తొలిసారిగా ఒక ఆర్గనైజ్డ్‌ వ్యవస్థగా గ్రామ స్థాయి వరకు బలోపేతం చేశాం. 

చంద్రబాబుకు ప్రజాబలం లేదు.. కేవలం భ్రమలు కల్పించే మీడియా వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం,  కుట్రలతో అధికారం చలాయిస్తున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న మనపై పోలీసులతో  అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను తీవ్ర అప్పుల ఊబిలోకి నెట్టి, అబద్ధాలతో స్వర్గం చూపిస్తున్నది. 

పాలనలో విఫలమై, ప్రశ్నించే వారిపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల ఆకాంక్షలే శ్రీరామరక్షగా మన పార్టీ ధృఢంగా నిలబడింది.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో  స్వీప్‌ చేయడానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంది. నాయకత్వ నిబద్ధత, కార్యకర్తల కృషితో 2029లోభారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం’ అని స్పష్టం చేశారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)