Breaking News

‘ఈనాడు’ తప్పుడు రాతలు.. సజ్జల వార్నింగ్‌

Published on Tue, 08/27/2024 - 14:47

సాక్షి, గుంటూరు: ‘ఈనాడు’ తప్పుడు రాతలను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు.

‘మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న హత్యలు, దౌర్జన్యాలు, దాడులు, ఆస్తుల విధ్వంసంతో అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం కూటమి ప్రభుత్వం, దానికి సంబంధించిన మీడియా కొత్త పన్నాగం మొదలు పెట్టింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీయడం, ఆ పార్టీ నాయకుల వ్యక్తిత్వ హననం లక్ష్యంగా అవాస్తవ కథనాలు రాస్తున్నారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు.’’ అని సజ్జల మండిపడ్డారు.

‘‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’.. ‘అంటూ ఈనాడు పత్రిక రాసిన కథనం కూడా ఆ కోవలోనిదే. ఆ పత్రిక రాసిన కథనాన్ని పట్టుకుని టీడీపీ, ఆపార్టీకి సంబంధించిన సోషల్‌ మీడియా, మరికొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ కథనం పూర్తిగా అవాస్తవం. అసంబద్ధం. అన్యాయంగా, అడ్డగోలుగా రాశారు. నా ప్రతిష్టను దెబ్బ తీసేలా ఇలాంటి కథనం రాసినందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)