Breaking News

కవిత ఏం మాట్లాడిందో తెలీదు: సబితా

Published on Thu, 05/29/2025 - 17:03

సాక్షి, హైదరాబాద్‌: కవిత ఏం మాట్లాడిందో తనకు తెలీదని.. ఆమె వ్యాఖ్యలపై పార్టీ స్పందిస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. గత పదేళ్లలో విద్యకు కేసీఆర్‌ ఏం చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను వ్యతిరేకించడం లేదు. విధాన పరమైన నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నాం. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రూ.80 కోట్లని ఒకసారి.. మరోసారి 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం అన్నారు. ఇప్పుడేమో రూ. 200 కోట్లకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ నిర్మాణం అంటున్నారు. ఇలా ఎందుకు అంచనాలు పెంచుతున్నారు. ఒక్కో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కి ఎంత ఖర్చు పెడుతున్నారో చెప్పండి’’ అంటూ సబితా ప్రశ్నించారు.

ఏడాది కాలంగా విద్యలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు?. ఎన్ని నియోజక వర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రణాళిక ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలి. పెండింగ్ 8 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించండి. భవనాలు మాత్రమే కడితే సరిపోదు. సిలబస్‌లో ఏం మార్పు తెస్తున్నారు. ఆ స్కూళ్లలో ఎవరికి అడ్మిషన్స్ ఇస్తారు. సైనిక్, నవోదయ, మోడల్, మన ఊరూ-మన బడి, మండల స్థాయి స్కూళ్లను ఏం చేస్తారో ప్రభుత్వం చెప్పాలి.

..మా హయంలో ఉద్యోగాలే ఇవ్వలేదనీ రేవంత్‌ మాట్లాడుతున్నాడు. ఏడాదికి మీరు ఇస్తామన్న ఉద్యోగాలు ఇచ్చారా?. కుల వృత్తులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే బర్లు, గొర్లు పంచారు. రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలతో వెట్టి చాకిరి చేయిస్తున్నారు.’’ అంటూ సబితా మండిపడ్డారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)