Breaking News

‘శభాష్ రేవంత్ రెడ్డి.. మిత్రుడంటే మీలా ఉండాలి’

Published on Thu, 07/09/2026 - 19:24

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శభాష్ రేవంత్ రెడ్డి.. మిత్రుడంటే మీలా ఉండాలి. బండి సంజయ్ పుట్టినరోజుకు సీఎం స్పెషల్ గిఫ్ట్ పంపారు. భగీరథ్‌కు బెయిల్ రావడం బాధాకరం. కోర్టు తీర్పును గౌరవిస్తాం. బాధిత కుటుంబానికి అండగా ఉంటాం’’ అంటూ బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్‌ చేశారు. బండి  భగీరథ్‌ బెయిల్‌పై ఆయన ఎక్స్‌ వేదికగా  స్పందించారు.

‘‘ఈ కేసు దర్యాప్తులో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిందితుడ్ని ఎలాగైనా బెయిల్ ఇప్పించి కాపాడాలన్న ఉత్సుకత కొట్టొచ్చినట్టు కనబడింది. ఈ వ్యవహారం మొత్తం మైనర్ అమ్మాయిల భధ్రత పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ చిత్తశుద్ధిని, మైనర్ అమ్మాయిల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరును సూచిస్తుంది. హోంమంత్రి రేవంత్ రెడ్డి నేటికీ బాధితురాలిని పరామర్శించకపోవడం దీనికి స్పష్టమైన సంకేతం. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో స్పెషల్ పీపీ (పబ్లిక్ ప్రాసిక్యూటర్)ని నియమించినా ఈ కేసులో మాత్రం ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించింది. కనీసం సిట్‌ కూడా వేయలేదు.’’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మండిపడ్డారు.

‘‘నిందితునికి రహస్యంగా పరీక్షల పేరిట మధ్యంతర బెయిల్ వచ్చినపుడే.. రేవంత్ రెడ్డి- బండి సంజయ్‌ల బలమైన మైత్రి బంధం బయటపడింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర హోం మంత్రిగా, బండి సంజయ్ కేంద్ర హోం మంత్రిగా ఉన్నంత కాలం బాధిత మైనర్‌కు న్యాయం జరగదు. ఈ చర్యతో ప్రభుత్వం ఎంతో మంది అమ్మాయిల, తల్లిదండ్రుల మనో ధైర్యాన్ని దెబ్బ తీసింది. బాధితుల తరపున నిలబడాల్సిన ప్రభుత్వం, ప్రభుత్వ తరపు న్యాయవాదులు నిందితుని తరపున నిలబడ్డారు. బాధిత బాలిక ఒక ప్రైవేట్‌ లాయర్‌ను ఆశ్రయించక పోయుంటే ఈ కేసు ఎప్పుడో నీరుగారిపోయేది. మధ్యంతర బెయిల్ వచ్చినపుడు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించిన తీరు చూసి.. మిగతా న్యాయవాదులంతా ముక్కున వేలేసుకున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.

.. అయితే, ఇదంతా కేవలం ముఖ్యమంత్రి, హోం మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందన్నది నిప్పు లాంటి నిజం. 10 నుండి 20 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాల్సిన నిందితుడు, నేడు బెయిల్‌పైన బయటకు రాబోతున్నాడు. ఈ నిందితుడు ప్రభుత్వం ఇచ్చిన అభయంతో ఇంకా ఎన్ని అఘాయిత్యాలు,ఎన్ని ఘాతుకాలకు పాల్పడుతాడో ఊహించలేం. ఏదేమైనా ఈ మైనర్ బాలికను కాపాడుకోవాల్సిన బాధ్యత యావత్ తెలంగాణ సమాజానిదే.

..ఆమె భవిష్యత్‌లో న్యాయం కోసం చేసే ఏ పోరాటానికైనా మనం అందరం ఆమెకు బాసటగా నిలబడాలి. మొత్తానికి జులై 11న పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. శభాష్ రేవంత్‌రెడ్డి.. మిత్రుడంటే మీలా ఉండాలి’’ అంటూ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ సెటైర్లు విసిరారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)