Breaking News

RLD: అలా ఎన్‌డీఏలో చేరిక.. ఇలా అభ్యర్థుల ప్రకటన!

Published on Mon, 03/04/2024 - 22:08

బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏలో అధికారికంగా చేరిన రెండు రోజుల్లోనే రాష్ట్రీయ జనతాదళ్ (RLD) లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ఆర్‌ఎల్‌డీ వెల్లడించింది. 

జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ పార్టీ బిజ్నోర్ నుండి చందన్ చౌహాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ నుండి రాజ్‌కుమార్ సాంగ్వాన్‌లను పోటీకి దింపింది.  2019 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన మలూక్ నగర్ బిజ్నోర్ స్థానాన్ని గెలుచుకుంది. బాగ్‌పట్ సీటును బీజేపీ అభ్యర్థి సత్యపాల్ సింగ్ గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికలకు కూడా ఆర్‌ఎల్‌డీ అభ్యర్థిని ప్రకటించింది. యోగేష్ చౌదరిని రంగంలోకి దించింది. 

ఉత్తరప్రదేశ్‌లో 51 మందితో సహా దేశవ్యాప్తంగా 195 మంది అభ్యర్థులను బీజేపీ ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా 80 సీట్లు ఉండటంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏతో పాటు ప్రతిపక్ష ఇండియా కూటమికి ఉత్తరప్రదేశ్ కీలకం . జయంత్ చౌదరి తాత, మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు మరణానంతరం గత నెలలో భారతరత్న అవార్డు లభించింది. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో 2019లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల పొత్తుతో పోటీ చేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 80 స్థానాలకు గానూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 64 స్థానాలను కైవసం చేసుకుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)