‘మా ప్రభుత్వం వస్తే అధికారులు పదింతలు చెల్లించుకుంటారు’

Published on Tue, 01/06/2026 - 11:44

సాక్షి,నెల్లూరు: చంద్రబాబు,లోకేష్‌కు అధికారులు భజన బ్యాచ్‌లా తయారయ్యారు. మా ప్రభుత్వం వచ్చాక అధికారులు పదింతలు చెల్లించుకుంటారని మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిని పరామర్శించారు.

అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పిన్నెల్లి సోదరులపై కక్షగట్టి వేధిస్తున్నారు. టీడీపీ నేతలు తన్నుకుని హత్యలు చేస్తున్నారు. ఖాకీ చొక్కాలు వేసుకోవాల్సిన పోలీసులు పచ్చ చొక్కాలు ధరిస్తున్నారు. కోర్టు ఆర్డర్స్‌ బేఖాతరు చేస్తూ భోజనం పెట్టడం లేదు. గుర్తుంచుకోండి తిరిగి మా ప్రభుత్వం వచ్చాక అన్నీ తిరిగి ఇస్తాము. అధికారులు నేతలకు, లోకేష్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేడు రాష్ట్రంలో గంజాయి, మహిళలపై దాడి, హత్యా రాజకీయాలు చేస్తుంది టీడీపీ. 

రాష్ట్ర పరువును గంగపాలు చేశారు. సంపద అంటూ అప్పులు చేసుకుంటూ పోతున్నారు. నేటితో 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. అభివృద్ధి శూన్యం, సంక్షేమం జీరో. తాజాగా రాయలసీమ ప్రాంత వాసులకు వెన్నుపోటు పొడిచాడు. రాయలసీమ కరువు పరిష్కారం అయిన లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆపివేయించాను అని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈ ఘోరానికి ఒడిగట్టాడు. రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా వున్నారు. 

బోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో క్రెడిట్ చోరిగి దిగారు.ఎన్నికలకు ముందు రాయి వేయడం మాత్రమే చంద్రబాబుకు తెలుసు. స్వయంగా జీఎంఆర్‌ కంపెనీ తెలిపింది వైఎస్‌ జగన్ హయాంలో నిర్మాణం జరుగుతుంది అని..2019లో కుప్పంలో ఎయిర్ పోర్టుకు చంద్రబాబు వేసిన రాయి సంగతి చూడండి. రామ్మోహన్‌ నాయుడు మైకుల ముందు హీరో.. చేసేది అంతా జీరో. పిన్నెల్లి రామకృష్టారెడ్డి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని సూచించారు.  

RK Roja : అందుకే 36వ ర్యాంకు వచ్చింది ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.

 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)