Breaking News

పిఠాపురం జనసేనలో ‘కోడ్‌ చిచ్చు’

Published on Tue, 02/25/2025 - 09:27

కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ రచ్చ.. జనసేన పార్టీలో చిచ్చు రాజేసింది. స్థానిక జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్‌ను వేదిక మీదకు సిబ్బంది అనుమతించకపోవడంతో మొదలైన గొడవ.. అప్పటికే వేదిక మీద ఉన్న జనసేన కోఆర్డినేటర్‌ వైశాలి వివరణతో మరింత ముదిరింది. 

పాదగయ క్షేత్రంలో(Pada Gaya Temple) సోమవారం రాత్రి కుక్కటేశ్వర స్వామివారి దివ్యకల్యాణం జరిగింది. ఈవో జగన్మోహన్‌ ఆహ్వానం మేరకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్‌ సతీసమేతంగా ఆలయానికి వచ్చారు. అప్పటికే కల్యాణ వేదికపై ఈవో దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే మర్రెడ్డి దంపతులు స్టేజ్‌ ఎక్కబోతుండగా.. ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉందని, కాబట్టి వేదిక ఎక్కేందుకు అనుమతించమని చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఆలయంలో ఆందోళనకు దిగారు.

ఈవో భార్య వైశాలి(EO Wife Vishali) స్థానిక జనసేన పార్టీ కోఆర్డినేటర్‌. దీంతో ఆమెను ఎలా కూర్చోనిచ్చారంటూ జనసేన నేతలు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాను పార్టీపరంగా కాకుండా.. ఈవో భార్యగానే వేదిక మీద ఉన్నానంటూ ఆమె చెప్పారు. దీంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ జరుగుతుండగానే.. ఈవో దంపతులు లేచి స్వామివారి కల్యాణం మధ్యలోనే వెళ్లిపోయారు. 

దీంతో.. అపచారం జరిగిందంటూ భక్తులు చర్చించుకున్నారు. మరోవైపు మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది అవమానించారంటూ కాసేపు హల్‌చల్‌ చేసి.. కాసేపు అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)