Breaking News

రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీ మాతో కలిసి రావాలి: సీఎం రేవంత్‌

Published on Tue, 02/04/2025 - 14:45

Telangana Assembly Updates

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌..

ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి

  • వీరికి 15 శాతం రిజర్వేషన్ ను కమిషన్ కేటాయించింది

  • ఎస్సీల్లో అత్యంత వెనకబడిన కులాలకు 1% , మాదిగ , దిగ ఉప కులాలకు 9%, మాల ,మాల ఉప కులాలకు 5% రిజర్వేషన్లు కేటాయించింది.

  • క్రిమిలేయర్ విధానాన్ని కేబినెట్ తిరస్కరించింది.

  • ఎస్సీ వర్గీకరణ కమీషన్ సూచన మేరకు రిజర్వేషన్లు అమలు చేస్తాం
  • వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేసారు\
  • మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది.
  • నా రాజకీయ జీవితంలో కులగణన, ఎస్సీ వర్గీకరణ ద్వారా జీవితం పరిపూర్ణం అయింది.
  • కులగణన ,ఎస్సీ వర్గీకరణ తో దేశం లోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవబోతుంది.
  • 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ అవసరం
  • రిజర్వేషన్లు అమలు కోసం మాతో కలిసి బిజెపి రావాలి.
  • పిసిసి ఆమోదం తీసుకొని పార్టీపరంగా రిజర్వేషన్లను అమలు చేస్తాం.

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేశారు. కమిషన్ సిఫారసు సారాంశాన్ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఎస్సీలను 3 గ్రూపులుగా వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది. ఎస్సీలలో మొత్తం 59 ఉప కులాలను కమిషన్ గుర్తించింది. దాని ప్రకారం 3 గ్రూపులుగా వర్గీకరణ చేయాలని సూచించింది.

కులగణన తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రానికి కోరుతూ తీర్మానం జరిపాం. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం. మిగితా రాష్ట్రాల కంటే ముందే ఎస్సీవర్గీకరణ అమలు చేస్తాం. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్‌ రిపోర్ట్‌ ఇచ్చింది. ఎస్సీ కులాలను గ్రూప్‌1,2,3గా వర్గీకరించాలని సిఫారసు. 15శాతం ఎస్సీ రిజర్వేషన్‌ను 3 గ్రూపులకు పెంచుతూ సిఫారసు. గ్రూప్‌-1లో 15 ఉపకులాలకు 1శాతం రిజర్వేషన్‌ సిఫారసు. గ్రూప్‌-2లో 18 ఉపకులాలకు 9శాతం రిజర్వేషన్‌ సిఫారసు. గ్రూప్‌-3లో 26 ఉపకులాలకు 5శాతం రిజర్వేషన్‌ సిఫారసు చేసినట్లు వ్యాఖ్యానించారు.

అంతకుముందు సీఎం రేవంత్‌ మాట్లాడుతూ..

 తెలంగాణలో చేపట్టిన సమగ్ర సర్వే దేశానికి దిక్సూచి వంటిదని సీఎం రేవంత్‌రెడ్డి (revanth reddy) అన్నారు. కులగణనపై (telangana census survey) తెలంగాణ అసెంబ్లీ (telangana assembly) లో సీఎం రేవంత్‌ బీఆర్‌ఎస్‌ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భూముల వివరాలు అడిగినందుకే బీఆర్‌ఎస్‌ నేతలు కులగణన సర్వేలో పాల్గొనలేదని అన్నారు.    

‘అపోహల సంఘం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను తప్పుదోవ పట్టిస్తుంది. ఓ ఫేక్ డేటాను సర్క్యూలేట్ చేసి జనాభా ఎక్కువ ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు.గత ప్రభుత్వం సర్వే రికార్డులో 33వ పేజీలో జనాభా పై క్లారిటీ ఉంది చెక్ చేసుకోండి. 2014 సర్వే ప్రకారం బీసీ జనాభా 51 శాతం ఉంటే..ఇప్పుడు 56 శాతం ఉన్నారు. అదే ఓసీలు 2014 సర్వే ప్రకారం 21 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం ఉన్నారు. బీసీ జనాభా పెరిగింది కానీ..తగ్గింది అని ఎలా చెప్తారు.

కులగణనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ: Revanth Reddy

సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ అధికారికమో కాదో హరీష్ రావు, కేటీఆర్ చెప్పాలి. అధికారం అని చెప్తే..దానిపైనే చర్చ చేద్దాం. కేసీఆర్ ,కేటీఆర్ ,హరీష్ రావు ,పద్మారావు ,పల్లా రాజేశ్వర్ రెడ్డి ,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, డీకే అరుణ లాంటి వారు సర్వేలో పాల్గొనలేదు. భూమి వివరాలు అడిగినందుకే వీరంతా సమాచారం ఇవ్వలేదు’ అని దుయ్యబట్టారు. 

సర్వేలో పాల్గొనండి
జనాభా లెక్కించడం బీజేపీకి ఇష్టం లేదు. 2021లో జరగాల్సిన జనగణనను బీజేపీ ఇప్పటి వరకు ఎందుకు చేయడం లేదు. సమగ్ర కుటుంబ సర్వే ను గత ప్రభుత్వం అధికారిక రిపోర్ట్‌గా ప్రకటించలేదు. 2011 జనాభా లెక్కలు మినహా.. ఏ అధికారిక లెక్కలు లేవు. అపోహలు సృష్టించే డాక్యుమెంట్స్ తెచ్చి సభ్యులు సభను తప్పుదోవ పట్టించుకోకండి. ఇప్పటికైనా సర్వేలో పాల్గొనని వారు వివరాలు ఇవ్వండి.

1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు
ఇప్పటి వరకు ఎవరి జనాభా ఎంత అనే సైంటిఫిక్ డేటా లేదు. అందుకే కులగణన చేశాం. 1931 తర్వాత దేశంలో కులగణన జరగలేదు. కేవలం ఎస్సీ, ఎస్టీ జనాభా వివరాలు మాత్రమే ఇప్పటి వరకు మన దగ్గర ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల కారణంగా కులగణన కొంత ఆలస్యం అయింది.వివిధ రాష్ట్రాలలో సర్వేలు చేసి..పకడ్బందీగా కులగణన చేశాం.లక్షకు పైగా అధికారులతో కులగణన వివరాలు సేకరించారు. 76 వేల మంది ఉద్యోగులు డేటా ఎంట్రీ చేశారు.  

రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్‌ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎ‍స్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే  56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి.  కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు.  

రాహుల్‌గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టాం. ఏడాదిలోపు సర్వేను పూర్తి చేశాం. సర్వే సామిజక ఎక్సరేలాంటి. బలహీన వర్గాలకు విద్యా,రాజకీయంగా రిజర్వేషన్‌ కల్పిస్తాం. డేటా పూర్తి చేయడానికి 36 రోజులు పట్టింది. 75 అంశాలతో రాష్ట్రంలో సర్వే నిర్వహించాం. తెలంగాణలో మొత్తం కోటీ 12లక్షల కుటుంబాలు. అందులో బీసీలు 46:25శాతం, ఎస్సీలు-17:43శాతం, ఎ‍స్టీలు-10:45శాతం, ముస్లీం బీసీలు కలిపితే  56:33శాతం ఉన్నారు. సర్వేలో 1,12,15,134 కుటుంబాలు పాల్గొన్నాయి.  కులగణనలో పాల్గొన్న వారందరిని ,పనిచేసిన వారందరినీ పార్టీలకు అతీతంగా అభినందించాలి’ అని అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)