Breaking News

రంగంలోకి డీకే శివకుమార్‌.. ట్రబుల్‌ షూటర్‌తో రేవంత్‌ రెడ్డి భేటీ

Published on Tue, 06/13/2023 - 13:41

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌తో మంగళవారం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. టీ-కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి డీకేతో రేవంత్‌ చర్చించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్‌ కీలకపాత్ర పోషించాడు.

ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల్లోనూ డీకే అంతా తానై చక్రం తిప్పుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకులను మళ్లీ పార్టీలోకి రప్పించే యత్నాలు బెంగళూరు కేంద్రంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. 

కాగా మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు  జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. ‍కర్ణాటక విజయ మంత్రాన్నే తెలంగాణలో పఠించాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది. దీనికి సంబంధించి వ్యూహాలకు పదును పెడుతోంది.

మరోవైపు తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పలు పార్టీల నుంచి వచ్చిన వలస నేతలు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరితో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌లో చేరిన హస్తం ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రియాంకగాంధీ సమక్షంలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలుంటాయని కాంగ్రెస్‌ చెబుతోంది.


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)