Breaking News

ఆరేళ్లలోనే... అత్యున్నత హోదాకు

Published on Wed, 12/06/2023 - 04:30

సాక్షి, హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్‌ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్‌ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు.  

వైఫల్యాలను అధిగమిస్తూ.. 
కాంగ్రెస్‌ పార్టిలో చేరిన తర్వాత రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ముందు వరుసలోకి వచ్చారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ హోదా దక్కించుకున్న కొద్దికాలంలోనే పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్‌ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవిచూశారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని పార్టీ ఓటమి పాలైంది.

అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్‌ అన్నీ తానై వ్యవహరించారు. అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)