Breaking News

కేసీఆర్‌.. శ్రీకాంతాచారి తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చారా?: కోమటిరెడ్డి ఫైర్‌

Published on Thu, 06/22/2023 - 13:18

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇచ్చింది. దశాబ్ధి దగా పేరుతో తెలంగాణలో కాంగ్రెస్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక, కేసీఆర్‌ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించింది. ఈ సందర్బంగా కేసీఆర్‌ విస్మరించిన ప్రధానమైన 10 హామీలను కాంగ్రెస్‌ హైలెట్‌ చేసింది. ఇందులో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు కాంగ్రెస్‌ నేతలు సూచించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలను పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌, కొన్ని చోట్ల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

ఈ సందర్బంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్ది స్పందించారు. ఈ క్రమంలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నాయకుల అరెస్ట్‌ అప్రజాస్వామికం. దశాబ్ధి పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది కచ్చితంగా దశాబ్ధి దగానే. కేసీఆర్‌ ఒక్క హామీనైనా పూర్తిగా అమలు చేశారా?. కేసీఆర్‌ మోసాలను మేము ప్రశ్నిస్తే అరెస్ట్‌లా? అని ప్రశ్నించారు. 

మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల హక్కులను సీఎం కేసీఆర్‌ కాలరాస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకుల అరెస్టులు దుర్మార్గం. అరెస్ట్‌ చేసిన నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలి. కేసీఆర్‌ ఒక్క హామీనైనా నెరవేర్చారా?. తెలంగాణ అమరవీరులను సీఎం కేసీఆర్‌ మరచిపోయారు. తొమ్మిదన్నరేళ్ల తర్వాత మీకు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ గుర్తుకొచ్చారా?. తెలంగాణ ద్రోహులను కేసీఆర్‌ తన పక్కన పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. తప్పులను ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు చేస్తారా? అని ప్రశ్నించారు.  

ఇదే సమయంలో ప్రియాంక గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాంధీని తెలంగాణలోని 33 జిల్లాల్లో పర్యటించాలని కోరాను. ప్రియాంకను తెలంగాణలో ఎంపీగా పోటీ చేయాలని కోరతాం. తెలంగాణ కాంగ్రెస్‌లో విబేధాలు విడిచి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారి మౌనం వెనుక కారణం?

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)