Breaking News

రాజకీయ కుట్రతో చారిత్రక చిహ్నాల తొలగింపు

Published on Fri, 05/31/2024 - 05:49

చార్మినార్‌ (హైదరాబాద్‌): తెలంగాణ రాజముద్ర లోని చారిత్రక చిహ్నాలను రాజకీయ కుట్రతోనే మార్చాలనుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. జాక్‌పాట్‌ ముఖ్యమంత్రి మూర్ఖపు ఆలోచనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ రాజముద్రలో చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను తొలగించాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్‌ ఆధ్వర్యంలో బుధవారం చార్మినార్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.

అనంతరం గుల్జార్‌హౌజ్‌ నుంచి చార్మినార్‌ వరకు కాలినడకన వచ్చిన ఆయన చార్మినార్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. చేతనైతే గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలి తప్ప.. కేసీఆర్‌పై కక్షతో ఆయన చేసిన అభివృద్ధిని కాలరాయొద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. 

చారిత్రక గుర్తింపును విస్మరించారు..
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉన్న వారసత్వ కట్టడాల చిహ్నాలను రాజ ముద్ర నుంచి తొలగించాలని చూడటం తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడమేనని కేటీ ఆర్‌ చెప్పారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ కట్టడాలకు చారిత్రక గుర్తింపు ఉందన్న విషయా లను సీఎం రేవంత్‌రెడ్డి విస్మరించడం దురదృష్టకరమ న్నారు. లేని వాటిని చేర్చితే మంచిదే గానీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయిన చిహ్నాలను ఎలా తొలగిస్తారని కేటీఆర్‌ ప్రశ్నించారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు.

చార్మినార్‌ చిహ్నాన్ని తొలగించడమంటే ప్రతి హైదరాబాదీని అవమానించినట్లేనన్నారు. ఎన్నో ఉద్యమాలు, త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని.. వీరందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మారావు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రులు రాజయ్య, పొన్నాల లక్ష్మయ్య, చార్మినార్‌ బీఆర్‌ఎస్‌ ఇంచార్జి మహ్మద్‌ సలావుద్దీన్‌ లోధీ తదితరులు పాల్గొన్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)