Breaking News

సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్‌ గాంధీ

Published on Sat, 07/15/2023 - 17:01

ఢిల్లీ: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ కీలక నేత రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ‘మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసు’లో ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన అనర్హత వేటుతో ఎంపీ పదవిని సైతం కోల్పోయారు. ఈ శిక్షపై స్టే విధించాలంటూ ఆయన కింది కోర్టులను ఆశ్రయించగా.. అక్కడ ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. అందుకే ఆయన సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు.  

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా.. కర్ణాటక కోలార్‌లో జరిగిన ర్యాలీలో మోదీ అనే పదం ప్రస్తావన తెచ్చి ఇంటి పేరు ఉన్నవాళ్లంతా దొంగలే అంటూ రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ పరువు నష్టం దావా వేశారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన సూరత్‌ కోర్టు ఈ క్రిమినల్‌ పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 

ఆ మరుసటి రోజు అంటే మార్చి 24వ తేదీన ఆయన లోక్‌సభ స్థానంపై అనర్హత వేటు పడింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం 1951 బలమైన సెక్షన్‌ 8 ప్రకారం ఆయనపై వేటు వేసినట్లు లోక్‌సభ కార్యదర్శి ప్రకటించారు.   తక్షణం వేటు అమలులోకి వస్తుందని ప్రకటించారు. 

► అయితే బెయిల్‌ దక్కించుకున్న రాహుల్‌ గాంధీ తన శిక్షపై స్టే విధించడం ద్వారా.. లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 

► ఈ క్రమంలో సెషన్స్‌ కోర్టు ఆయనకు శిక్షపై స్టే విధించేందుకు అంగీకరించలేదు. దీంతో గుజరాత్‌ హైకోర్టుకు వెళ్లారాయన. 

► జులై 7వ తేదీన గుజరాత్‌ హైకోర్టు ఆయన రివ్యూ పిటిషన్‌పై స్పందిస్తూ.. 

దిగువ కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయడానికి(స్టే విధించడానికి) రాహుల్‌ గాంధీ చూపించిన కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు. అందరుదైన సందర్భాల్లో మినహా శిక్షపై స్టేవ ఇవ్వడం తప్పనిసరేం కాదు. ఆయనపై ఇప్పటికే 10 కేసులు దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత కేసులో ఆయనకు కింది కోర్టు శిక్ష విధించడం సరైందే.. అలాగే న్యాయబద్ధమైందే. అందుకే ఈ పిటిషన్‌ను కొట్టేస్తున్నాం అని తీర్పు ఇచ్చింది. 

► సెషన్స్‌ కోర్టు, గుజరాత్‌ హైకోర్టు ఎదురు దెబ్బ తగిలింది. దీంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. 

► ఒకవేళ సుప్రీంకోర్టులోనూ ఆయనకు వ్యతిరేక తీర్పు(ఊరట దక్కకున్నా) వెలువడితే.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి ఆయన అనర్హుడు అవుతారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)