Breaking News

‘నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు’

Published on Mon, 07/31/2023 - 16:20

సాక్షి, సూర్యాపేట జిల్లా: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని, కొంతమంది కావాలనే తనపై ఈ రకమైన ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పనికట్టుకుని బీఆర్‌ఎస్‌తో పాటు కొంతమంది సొంత పార్టీ నాయకులే దుష్ప్రచారం చేస్తున్నారు. నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాలాంటి వ్యక్తి పై దుష్ప్రచారం జరగడం దురదృష్టకరం. దయచేసి ప్రజలు , కార్యకర్తలు ఎవరు దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు నన్ను సంప్రదించలేదు. నన్ను పార్టీ మారమని అడిగే దమ్ము ఎవరికి లేదు. నా పుట్టుక కాంగ్రెస్ చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సూర్యాపేట నుండే పోటీ చేయబోతున్నా.

టికెట్ నాదే.. గెలుపు నాదే ఇందులో ఎలాంటి అనుమానంలేదు. లోకల్ నాన్ లోకల్ అని ప్రచారం కరెక్ట్ కాదు. ఎవరు పార్టీలో లేనప్పుడు నేనొక్కడినే ఇక్కడ నుండి గెలిచా. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేశా. ఇండిపెండెంట్ గా గెలిచినా ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ మారకుండా తిరిగి కాంగ్రెస్ లోకే వచ్చా. నాకు గ్రూపులు లేవు నాది కాంగ్రెస్ గ్రూపు సోనియా గ్రూపు. పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తా’ అని దామోదర్‌రెడ్డి స్పష్టం చేశారు.

చదవండి:  ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నారా?.. ట్రాఫిక్‌ రూల్స్‌ మారాయ్‌.. కొత్త స్పీడ్‌ లిమిట్స్‌ ఇవిగో

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)