Breaking News

బీజేడీ నుంచి ఎంపీ బహిష్కరణ.. కాసేపటికే బీజేపీలోకి

Published on Fri, 09/06/2024 - 15:58

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడన్న కారణంతో రాజ్యసభ ఎంపీ సుజీత్‌ కుమార్‌ను మాజీసీఎం నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌(బీజేపీ) పార్టీ నుంచి బహిష్కరించింది. 

ఎంపీ సుజీత్ కుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, ఈ బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంటూ బీజేపీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది. తనను రాజ్యసభకు పంపిన పార్టీని, కలహండి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను అతను నెరవేర్చడంలో విఫలమయ్యాడని ఉత్తర్వుల్లో పేర్కొంది.

దీంతో సుజీత్‌కుమార్‌ వెంటనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సుజీత్‌ కుమార్‌ రాజీనామా లేఖను భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కఢ్‌ ఆమోదించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పార్టీ ఒడిశా ఇన్‌ఛార్జ్ విజయపాల్ సింగ్ తోమర్, ఎంపీ భర్తృహరి మహతాబ్, పార్టీ సీనియర్ నేతల సమక్షంలో సుజీత్ కుమార్ కాషాయ కండువా కప్పుకున్నారు.

అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కుమార్ మాట్లాడుతూ..  2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా, 2036 నాటికి ఒడిశాను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ కృషి, ఆయన దృక్పథానికి ఆకర్షితుడై తాను కాషాయ పార్టీలో చేరానని చెప్పారు.

‘నాకు దేశమే ప్రథమం. నేషన్ ఫస్ట్ అనేది నా ఫిలాసఫీ. నేను చాలా సంవత్సరాలు విదేశాల్లో నివసించాను . యునైటెడ్ నేషన్స్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి సంస్థల కోసం పనిచేశాను. దేశ అభివృద్ధి కోసం 2011లో భారతదేశానికి తిరిగి వచ్చాను.

ఒడిశాలోని కలహండి జిల్లా అనేక అవినీతి కారణంగా అభివృద్ధి చెందలేదని నేను. ఇందులో జిల్లాకు చెందిన పలువురు బీజేడీ నాయకుల హస్తం ఉంది.  ఈ విషయాన్ని బీజేడీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చాలాసార్లు ప్రయత్నించాను. కానీ సాధ్యపడలేదు. అందుకే బీజేపీలో చేరాలనే  నిర్ణయం తీసుకున్నాను.’ అని పేర్కొన్నారు.

 

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు