Breaking News

రాజస్థాన్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సహా 30 మంది అరెస్ట్‌

Published on Wed, 08/06/2025 - 07:28

జైపూర్‌: రాజస్థాన్‌లో విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించాలంటూ కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. జైపూర్‌లోని షహీద్‌ స్మారక్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సచిన్‌ పైలట్‌ కూడా పాల్గొన్నారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ కెనన్లను ప్రయోగించారు.

బారికేడ్లను దాటి సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలో ఉన్న సీఎం నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. వారిపైకి వాటర్‌ కెనన్లను ప్రయోగించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ముకేశ్‌ భాకర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వినోద్‌ జాకడ్‌ సహా 30 నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో అంతకుముందు పైలట్‌ మాట్లాడారు.

ఈ సందర్బంగా సచిన్‌ పైలట్‌.. ‘ఢిల్లీలోని ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంతో వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు. నిలిపివేసిన విద్యార్థి సంఘాల ఎన్నికలను తిరిగి నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలను మాట్లాడకుండా చేసినట్లే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజకీయాలు విద్యార్థి దశ నుంచే ప్రారంభం కావాలని, గెలుపోటములు కాకుండా ఎన్నికల ప్రక్రియను చేపట్టడమే ముఖ్యమైన అంశమన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను సైతం జరిపేందుకు భయపడుతోందని పైలట్‌ ఆరోపించారు. 

Videos

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)