Breaking News

అంతా తెలుసు.. టీ కాంగ్రెస్‌ నేతలకు రాహుల్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Published on Tue, 06/27/2023 - 18:44

సాక్షి, ఢిల్లీ: పార్టీలో ఏ నాయకులు ఏం చేస్తున్నారో అంతా తెలుసు.. ఇప్పటివరకూ ఎవరెవరు పార్టీ కోసం ఏం చేశారో, ఇప్పుడు ఏం చేస్తున్నారో తన దగ్గర సమాచారం ఉందని తెలంగాణ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశంలో రాహుల్‌ గాంధీ అన్నట్లు తెలిసింది. విబేధాల పేరుతో నోటికొచ్చినట్లు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే అధిష్టానం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలను రాహుల్‌ హెచ్చరించారు.

పార్టీ కోసం అన్ని స్థాయిల్లోని నేతలు కలిసికట్టుగా, ఐక్యంగా పనిచేయాల్సిందేనని కర్ణాటక ఎన్నికల వ్యూహంలో అనుసరించిన విధానాన్ని సమావేశంలో ఆయన వివరించారు టీపీసీసీ నేతల సూచనలు, సలహాలు విన్న రాహుల్‌.. నాయకులంతా ఏకతాటిపై నడవాలని కోరారు. కేసీఆర్‌ను ఓడించేందుకు నేతలందరూ విబేధాలు, చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టాలని సూచించారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహ రచన సమావేశం మూడు గంటల పాటు సుదీర్ఘగా సాగింది. కాగా భారీ చేరికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్‌ సంతరించుకుంది. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిలతో పాటు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి, జగ్గారెడ్డి, మధుయాష్కీ తదితరలు ఈ ఎన్నికల ‍వ్యూహ భేటీకి హాజరయ్యారు.
చదవండి: టీ కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం.. హైకమాండ్‌ ఏం చెప్పింది?

భేటీ అనంతరం టీపీసీసీ ఛీప్‌ రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ఎన్నికల కార్యచరణ మొదలైందని, రాబోయే 120 రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని తెలిపారు. ‘‘మేనిఫెస్టో రూపకల్పన త్వరగా పూర్తి చేయాలని చర్చ జరిపాం. అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. ఎన్నికల సన్నాహక సమావేశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించాం. అక్కడ అనుసరించిన మౌలిక అంశాలు ఇక్కడ కూడా అమలు చేయాలని డిసైడ్ అయింది’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)