Breaking News

రాజ్యాంగం మా రక్తం.. దాడి చేయడానికి మీరెవరు?: రాహుల్‌ గాంధీ

Published on Sat, 08/02/2025 - 11:26

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలకు దిగారు. లోక్‌సభ ఎన్నికలు రిగ్‌ అయ్యాయన్న.. ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ న్యాయ సదస్సులో రాహుల్‌ మాట్లాడుతూ.. 

‘‘నిప్పుతో చెలగాటమాడుతున్నానని ప్రియాంక(రాహుల్‌ సోదరి) నాతో చెబుతోంది. అవును.. నేను నిప్పుతో చెలగాటమాడుతున్నాననే విషయం నాకు తెలుసని అన్నాను. ఆ ఆట ఆపనని కూడా చెప్పాను. నేను దేనికి భయపడను. పిరికి పందలను చూసి భయపడొద్దని నా కుటుంబం చెప్పింది. కాంగ్రెస్ తప్పును తప్పు అని చెబుతుంది. నిజం ఉన్న చోట దైర్యం ఉంటుంది. బీజేపీకి ధైర్యం లేదు.. నిజం చెప్పలేదు’’ అని రాహుల్‌ మండిపడ్డారు. 

10-15 సీట్లతో మోదీ ప్రధాని అయ్యారు. ఆ పదిహేను సీట్లు లేకుంటే వాళ్లకు అధికారం దక్కేది కాదు.. మోదీ ప్రధాని అయ్యేవారు కాదు.  దేశంలో ఈసీకి ఉనికి లేదు. ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయిందన్నది సత్యం. లోక్‌సభ ఎన్నికలు రిగ్‌ అయ్యాయి.  లోక్ సభ ఎన్నికల్లో 100 సీట్ల వరకు రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు. లోక్ సభ ఎన్నికలు రిగ్గింగ్ చేయొచ్చా...? రిగ్గింగ్ జరిగిందా అనేది నిరూపిస్తాం. మహారాష్ట్ర ఓటర్ లిస్ట్ లో తప్పిదాలున్నాయి.. దాన్ని నిరూపించాం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చీటింగ్ జరిగింది.. దానికి సంబంధించి ఆధారాలున్నాయి. ఈసీ స్కాన్ ప్రొటెక్ట్ ఓటర్ లిస్ట్ ఎందుకు కలిగి ఉంది?. ఆరున్నర లక్షల ఓటర్లలో లక్షన్నర ఓట్లు ఫేక్ ఓట్లు. 

ఈసీ అవకతవకలపై మా దగ్గర 100 శాతం ఆధారాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటపెడతాం.ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేయడం లేదు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. రాజ్యాంగం మా రక్తంలాంటిది. మా రక్తంపై దాడి చేయడానికి మీరేవరు?. మేము రాజకీయంగా పోరాడుతున్నాం.. రాజ్యంగం కోసం న్యాయవాదులు కోర్టుల్లో పోరాడుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుతోంది న్యాయవాదులే అని రాహుల్‌ అన్నారు.

 

 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)