Breaking News

మిజోరాంలో రాహుల్‌ పర్యటన.. మోదీ టార్గెట్‌గా విమర్శలు..

Published on Mon, 10/16/2023 - 15:59

ఐజ్వాల్‌:  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీసగఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిన్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, సభలు, పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నాయి.

బీజేపీ టార్గెట్‌గా విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సోమవారం ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో పర్యటించారు. ఈ సందర్భంగా మరో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ హింస సమస్యను లేవనెత్తుతూ కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేసిందని ఆరోపించిన రాహుల్.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మోదీకి ముఖ్యమైనది కాదేమో!
ఈ మేరకు రాహుల్‌ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం మణిపూర్‌లో పర్యటించారు. రాష్ట్ర రూపాన్ని బీజేపీ నాశనం చేసింది. మణిపూర్‌ ఎన్నో రోజులు ఒక రాష్ట్రంగా ఉండలేదు. రెండు విడిపోతుంది. అక్కడ ప్రజలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులను చంపేస్తున్నారు. కానీ అక్కడికి(మణిపూర్‌) వెళ్లడం ప్రధాని మోదీకి ముఖ్యమైనదిగా కనిపించడం లేదు’ అని రాహుల్‌ మండిపడ్డారు.

రెండు రోజుల పర్యటన
రాహుల్‌ గాంధీ రెండు రోజుల పర్యటన (సోమవారం, మంగళవారం) నిమిత్తం మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం ఐజ్వాల్‌లోని చన్మారి జంక్షన్‌ నుంచి రాజ్‌ భవన్‌ వరకు (4,5 కి.మీ) పాదయాత్ర చేపట్టారు. అనంతరం గవర్నర్‌ నిలయం సమీపంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. నేడు సాయంత్రం విద్యార్థులతో రాహుల్‌ ముచ్చటించనున్నారు. 

మంగళవారం ఐజ్వాల్‌లో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. దక్షిణ ప్రాంతంలోని లుంగ్లీ పట్టణంలో కూడా ఆయన పర్యటించి అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత లుంగ్లీ నుంచి ప్రత్యేక విమానంలో అగర్తలా మీదుగా ఢిల్లీకి బయలుదేరుతారు.

అభ్యర్థుల ప్రకటన
40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా కాంగ్రెస్ నేడు విడుదల చేసింది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)