Breaking News

రాహుల్‌ గాంధీ దరఖాస్తు చేసుకోవాల్సిందే!

Published on Mon, 08/07/2023 - 21:27

ఢిల్లీ: జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే తీర్పుతో రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయ్యింది. ఇవాళ(సోమవారం) సభకు లోక్‌సభకు హాజరైన ఆయన హుషారుగా కనిపించారు కూడా. రేపు పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ ఉండనుంది. మణిపూర్‌ అంశం కావడం.. పైగా అక్కడ  ఆయన పర్యటించి ఉండడంతో.. వాస్తవాల ఆధారంగా కేంద్రాన్ని ఆయన నిలదీస్తారంటూ కాంగ్రెస్‌ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. 

అనర్హత వేటు తర్వాత తుగ్లక్‌ లేన్‌లోని తన అధికారిక బంగ్లాను ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఆయనకు అండగా నిలిచి.. కేంద్రంపై విరుచుకుపడ్డారు. అయితే రాహుల్‌ మాత్రం నిబంధనలకు అనుగుణంగా బంగ్లా ఖాళీ చేసి అధికారులకు అప్పగించారు. ఆ తర్వాత 10 జన్‌పథ్‌ రోడ్‌లోని తల్లి సోనియా గాంధీ నివాసానికి మారిపోయారాయన.  అయితే దానిని మరొకరికి ఇంకా కేటాయించలేదు. దీంతో ఇప్పుడు తన బంగ్లాను తానే చేజిక్కుంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారాయన.

ఈ క్రమంలో.. ఇవాళ ఉదయం లోక్‌ సభ హౌసింగ్‌ కమిటీ ముందు ఈ అంశాన్ని లేవనెత్తారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి. రాహుల్‌ తరపున తాను దరఖాస్తు చేస్తానని చెప్పారు. అయితే నిబంధనల ప్రకారం అలా కుదరదని హౌజింగ్‌కమిటీ తేల్చి చెప్పింది. రాహుల్‌ గాంధీ స్వయంగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో రేపు రాహుల్‌ గాంధీ తన బంగ్లాను తనకు కేటాయించాలని కోరే అవకాశం ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)