రాహుల్‌ హెలికాప్టర్‌ టేకాఫ్‌కు అనుమతి నిరాకరణ.. గంటపాటు ఆలస్యం

Published on Fri, 11/15/2024 - 15:58

కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీకి శుక్రవారం అనుకోని అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన హెలికాప్టర్‌కు ఏటీసీ నుంచి ఆనుమతి రాకపోవడంతో టేకాఫ్‌కు గంటకు పైగా ఆలస్యం అయ్యింది. దీంతో రాహుల్‌ చాలాసేపు హెలికాప్టర్‌లోనే ఉండాల్సి వచ్చింది.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గొడ్డాలో ప్రచారానికి వెళ్లారు కాంగ్రెస్‌ నేత. అక్కడ బహిరంగ ర్యాలీలో ప్రసంగించడం ముగిసిన తర్వాత ఆయన ప్రచారం కోసం మరో ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. అయితే హెలికాప్టర్‌ టేకాఫ్‌కు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి అనుమతి రాలేదు. భద్రతా కారణాల పేరుతో క్లియరెన్స్‌ ఆలస్యంగా లభించింది. ఈ సమస్యతో 75 నిమిషాలపాటు రాహుల్‌ హెలికాప్టర్‌లోనే ఉండాల్సి వచ్చింది. హెలికాప్టర్‌ టేకాఫ్‌కు ఆలస్యం అవడంతో రాహుల్‌ ప్రయాణ షెడ్యూల్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనిపై రాజకీయ వివాదం చెలరేగింది.

హెలికాప్టర్‌ టేకాఫ్‌కు అనుమతి ఆలస్యంపై కాంగ్రెస్‌ స్పందిస్తూ.. రాజకీయంగా ప్రేరేపితమైనదని మండిపడింది. ఇది బీజేపీ పన్నిన కుట్రేనని ఆరోపించింది. తమ ప్రచారాలను అణగదొక్కే ప్రయత్నమని పేర్కొంది. ‘రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాలను ఆలస్యం చేయడానికి చేసిన ప్రయత్నమే.. అధికారులు తమ అధికారాన్ని ఉపయోగించి మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నాయకులు తోసిపుచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), స్థానిక అధికారులు కానీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే, అదనపు భద్రతా తనిఖీలు, ఎయిర్‌స్పేస్ మేనేజ్‌మెంట్ ఆందోళనలు హోల్డ్‌అప్‌కు కారణమై ఉండవచ్చని సమాచారం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)