Breaking News

స్టైలిష్ లుక్‌లో రాహుల్.. లద్దాఖ్‌లో బైక్‌ టూర్‌..

Published on Sat, 08/19/2023 - 15:42

లేహ్‌: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లద్దాఖ్‌ పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాంగాంగ్ సరస్సు వరకు బైక్ రైడ్ చేపట్టారు. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకలను ఆగష్టు 20న అక్కడే నిర్వహించనున్నారు. బైక్‌ రైడ్‌కు సంబంధించిన దృశ్యాలను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేసుకున్నారు.  

KTM 390 బైక్‌ను కొనుగోలు చేసినట్లు రాహుల్ గాంధీ ఒకప్పుడు సోషల్ మీడియాలో తెలిపారు. కానీ భద్రతా కారణాల రీత్యా ఆ బైక్‌పై సెక్యూరిటీ బయటకు వెళ్లనీయడం లేదని అన్నారు. అయితే.. ప్రస్తుతం ఆ బైక్‌పైనే ఆయన పాంగాంగ్ సరస్సు వరకు వెళ్లనున్నారు. "ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్‌ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్‌ గాంధీ) చెప్పేవారు" అని అన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్‌ తమ ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పంచుకుంది. రాహుల్ లద్దాఖ్ పర్యటన ఆగష్టు 25న ముగియనుంది. 

దేశ రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పర్యటించారు. ఇటీవలే తమిళనాడు వెళ్లి ఊటీ సమీపంలో గిరిజన తెగలతో కలిసి ఆడిపాడారు. ప్రస్తుతం లద్దాఖ్ పర్యటనలో బైక్‌పై పాంగాంగ్ సరస్సు వరకు పర్యటిస్తున్నారు. 2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్‌ లద్దాఖ్‌కు రావడం ఇదే తొలిసారి. 

ఇదీ చదవండి: మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి.. కేంద్రానికి అఖిలేష్ కౌంటర్..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)