మణిపూర్ టు ముంబయి: మరికాసేపట్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం

Published on Sun, 01/14/2024 - 07:54

ఇంఫాల్: 

►మణిపూర్‌లోని  తౌభాల్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రారంభించడానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరారు.

►అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి రాహుల్ గాంధీ ఈ యాత్ర చేపట్టారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సమానత్వాన్ని ఎలుగెత్తడమే ఈ యాత్ర ధ‍్యేయమని పేర్కొన్నారు.

►కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'కు హాజరవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు కీలక నాయకులు బయలుదేరారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి మణిపూర్‌కు వెళుతున్నారు.

► కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోయే ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మణిపూర్‌లోని తౌబాల్‌ జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. న్యాయం కోసం పోరాటం నినాదంతో సాగనున్న ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్‌సభ నియోజవర్గాల మీదుగా సాగనుంది. దాదాపు 67 రోజులపాటు 6, 713 కిలోమీటర్లు రాహుల్‌ పర్యటించనున్నారు. మొత్తం 110 జిల్లాల మీదుగా సాగే ఈ యాత్రను..  మార్చి 20 లేదా 21న ముంబయిలో యాత్రను ముగించనున్నారు.  

మణిపుర్‌ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ మీదుగా మహారాష్ట్రల్లో సాగనుంది. తన యాత్రలో ప్రధాని మోదీ వైఫల్యాలు, నిరుద్యోగం, ధరల పెంపు, సామాజిక న్యాయం అంశాలు ప్రస్తావించనున్నారు. 

అయితే, తొలి దశలో జరిగిన భారత్‌ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్‌ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు పేర్కొన్నారు. 

కాగా  గతంలో రాహుల్‌  భారత్‌ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3500కి.మీ పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇది వర్గాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తించింది. అదే ఊపులో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం హస్తగతం చేసుకోవడం కాంగ్రెస్‌కు సరికొత్త జోష్‌ను అందించింది.

ఇదీ చదవండి: ‘ఇండియా’కు ఖర్గే సారథ్యం!

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)