Breaking News

ఓటు చోరీ.. ఇప్పుడు సీటు చోరీ: రాహుల్‌ గాంధీ

Published on Thu, 06/11/2026 - 19:16

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్‌ అయ్యారు. దేశాన్ని మోదీ సర్వనాశనం చేశారని చెప్పారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు కష్టాలే మిగులుతున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కార్‌ ఖూనీ చేస్తోందని చెప్పారు.

అలాగే, కాంగ్రెస్‌ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురైన విషయంపై రాహుల్‌ స్పందిస్తూ..  ‘‘ఓటు చోరీ, సర్కార్ చోరీ తర్వాత  బీజేపీ-ఈసీ జుగల్‌బందీ, సీటు చోరీతో పోటీ మొదలుకాకముందే ముగించేసింది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో ఏం జరిగిందో చూడండి.

కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ ప్రతి పత్రాన్ని సమర్పించారు. పెండింగ్ కేసులు లేవు. బీజేపీ చేసిన చిన్న అభ్యంతరం ఆధారంగా ఈసీ ఆమె నామినేషన్‌ను రద్దు చేసింది. బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నత్వానీ దరఖాస్తు పత్రంలో తన పేరునే తప్పుగా రాశారు. తప్పనిసరిగా వెల్లడించాల్సిన ఎన్నో వివరాలు ఇవ్వలేదు. వాటన్నింటినీ సరిచేసుకునేందుకు ఈసీ ఆయనకు గడువు పొడిగించింది.

ఒకరిని కనీసం విచారణ కూడా లేకుండానే అనర్హురాలిగా ప్రకటించారు. మరొకరికి మాత్రం నిబంధనలు పాటించకపోయినా ప్రోత్సాహం లభించింది. కాంగ్రెస్ నేతలు కలుస్తామని చెప్పినప్పుడు ఈసీ మొదట మమ్మల్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. చివరకు సమావేశం జరిగినప్పుడు, వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇలాంటివి ఇంకా ఎక్కువగా కనిపిస్తాయి. ఎందుకంటే బీజేపీకి ఎన్నికల్లో గెలవడం కంటే, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మార్చుకోవడం చాలా సులభం’’ అని అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)