Breaking News

నాడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థిస్తున్నారు

Published on Mon, 04/29/2024 - 05:07

డామన్‌/కటక్‌: రిజర్వేషన్లను ఆర్‌ఆర్‌ఎస్‌ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్‌ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్‌ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.

రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్‌ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్‌ఎస్‌–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. 

‘‘ ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్‌ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్‌ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్‌ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్‌ పదవిలో మోదీ ప్రఫుల్‌ పటేల్‌ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్‌కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)