Breaking News

బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు సంచలన ఆరోపణలు.. ఈసీకి లేఖ

Published on Sun, 05/26/2024 - 14:14

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ. 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు బీఆర్‌ఎస్‌ తెర లేపి, అక్రమాలకు పాల్పడుతోందని కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి లేఖలు రాశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారిక కెనరా బ్యాంక్ ఎకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇంఛార్జిలకు ఈ డబ్బు బదిలీ చేసిందని తెలిపారు.

ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంక్‌ అకౌంట్ డిటైల్స్‌ను కూడా తాను రాసిన లేఖకు జతచేశారు. ఈ వ్యవహారంపై వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటర్లను కొనుగోలు చేస్తుందని అన్నారు. వెంటనే అకౌంట్‌లో డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ జరపాలని కోరుతున్నామని రఘునందన్‌ రావు అన్నారు.

రాష్ట్రంలో ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రేపు (మే 27వ తేదీ 2024)న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్‌ మల్లన్న (కాంగ్రెస్‌), రాకేశ్‌రెడ్డి (భారాస), ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) ఉన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)